: న్యూజిలాండ్ లో పెరిగిపోతున్న భారతీయులు


న్యూజిలాండ్ దేశంలో ప్రవాస భారతీయులు పెరిగిపోతున్నారు. ఇటీవల విడుదల చేసిన జనాభా లెక్కల నివేదికలో ఈ విషయం వెల్లడయింది. దేశ జనాభాలో భారతీయులు లక్షా యాభై ఐదు వేల (1,55,000) మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే... భారతీయ జనాభాలో 48 శాతం వృద్ధి నమోదు అయిందని న్యూజిలాండ్ ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించింది. న్యూజిలాండ్ లో నివసించే విదేశీయుల్లో లక్షా డెబ్బై ఒక్క వేల (1,71,000) మందితో చైనా అగ్రస్థానంలో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. ఇక ఫిలిప్పీన్స్ దేశీయులు నలభై వేల (40000) మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో మొత్తం 4.24 మిలియన్ల మంది నివసిస్తున్నారని జనాభా లెక్కల్లో తేలింది.

  • Loading...

More Telugu News