: తిరుమల శ్రీనివాసుని భక్తులకు తీపి కబురు
కలియుగ దైవంగా కొనియాడే శ్రీనివాసుని భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. కాలి నడకన తిరుమలేశుని దర్శనార్థం వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందించనున్నట్టు టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. 4.5 లక్షల కిలోల ఆవునెయ్యి, 4.4 లక్షల కిలోల రవ్వ కొనుగోలుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. 'మనగుడి' కార్యక్రమాన్ని 44 వేల ఆలయాలకు విస్తరించాలని ఈ సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది.