: అభిప్రాయానికే అయితే అసెంబ్లీకి పంపడం ఎందుకు?: ద్రోణంరాజు


తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకోవడానికే అయితే బిల్లును అసెంబ్లీకి పంపడం ఎందుకని దిగ్విజయ్ సింగ్ ను ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రశ్నించారు. ఓటింగ్ లేదన్న డిగ్గీ రాజా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, గత సంప్రదాయాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నందున, దీనిపై సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చర్చతో పాటు ఓటింగ్ కూడా జరిగి తీరాల్సిందేనని ద్రోణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్రపతి 40 రోజుల గడువు ఇచ్చినందున శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని సూచించారు.

  • Loading...

More Telugu News