: లోకేష్ ట్విట్టర్ కి ఎక్కువ... రాజకీయాలకు తక్కువ: టీఆర్ఎస్
కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, ఎక్కడైనా సరే రాష్ట్ర అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమంటూ సవాలు విసిరిన టీడీపీ అధినేత తనయుడు లోకేష్ బాబుపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. లోకేష్ ‘ట్విట్టర్ కి ఎక్కువ... రాజకీయాలకు తక్కువ‘ అని దుయ్యబట్టింది. సత్యం రామలింగరాజుకి లోకేష్ పెంపుడు కొడుకని, ఆయన డబ్బులతోనే లోకేష్ విదేశాల్లో చదువుకున్నాడని ఆరోపించారు.