: బిల్లు ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రపతి లేదా పార్లమెంటుకు వెళ్లదు: పయ్యావుల


రాష్ట్ర విభజన ప్రక్రియ కొన్ని రోజుల వ్యవధిలో పూర్తయ్యేది కాదని, దానికి చాలా సమయం అవసరమని తెదేపా నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. బిల్లు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా నేరుగా రాష్ట్రపతి లేదా పార్లమెంటుకు వెళ్లదని... సంబంధిత శాఖలన్నింటి దగ్గరకూ వెళ్తుందని తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉందని... ఆ పార్టీకి రాష్ట్రాన్ని విభజించే శక్తి లేదని ఎద్దేవా చేశారు. శాసనసభకు బిల్లు వచ్చినంత మాత్రాన, అది చర్చ కోసం వచ్చినట్టు కాదని పయ్యావుల అన్నారు. కచ్చితంగా శాసనసభకు విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విభజన బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రెండు సార్లు వస్తుందని గతంలో దిగ్విజయ్ చెప్పారని... ఇప్పుడు మాత్రం ఓటింగ్ కూడా ఉండదని అంటున్నారని కేశవ్ విమర్శించారు. బిల్లుపై ఓటింగ్ కచ్చితంగా జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీని శాసించే హక్కు రాష్ట్రపతికి కూడా ఉండదని అన్నారు.

  • Loading...

More Telugu News