: నా కూతురు సినిమాల్లోకి వస్తే సంతోషం: అమీర్ ఖాన్
తన కూతురు ఇరా బాలీవుడ్ లోకి ప్రవేశిస్తే సంతోషిస్తానని నటుడు అమీర్ ఖాన్ చెప్పారు. అమీర్ మొదటి భార్య రీనా కూతురే ఇరా. వీరిద్దరికి జునాయిద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అలాగే, రెండో భార్య కిరణ్ రావు ద్వారా అజాద్ అనే మరో కొడుకు కూడా ఉన్నాడు. తన పిల్లలు ఏం చేయాలనుకుంటే అది చేస్తారని, వారిపై తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురానని అమీర్ చెప్పారు. వారు సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే సంతోషిస్తానన్నారు. అలా అయితే, వారితో కలిసి నటించవచ్చని.. అది అంతులేని ఆనందాన్నిస్తుందన్నారు. కనుక తన కూతురు సినిమాల్లోకి రావడం ఇష్టమేనని తెలిపారు.