: డిగ్గీ రాజాను విశాఖలో అడుగుపెట్టనివ్వం: టీడీపీ నేత బండారు
దిగ్విజయ్ త్వరలో విశాఖపట్నం వస్తున్నట్లు సమాచారం ఉందని, ఆయనను విశాఖ విమానాశ్రయంలోనే దిగ్బంధిస్తామని తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లుపై డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర శాసన సభలో చర్చించే అంశాలపై నిర్ణయాలను ఆయనెలా ప్రకటిస్తారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న డిగ్గీరాజాను విశాఖ గడ్డపై అడుగుపెట్టనివ్వమని బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు.