: ఇవాళ సాయంత్రం సికింద్రాబాదులో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి‘
ఫేస్ బుక్ స్నేహితులు, ఆత్మీయులనే కాదు.. అభిమానులనూ కలుపుతోంది. తాజాగా ఫేస్ బుక్ లో ఏర్పడిన ‘ఉషశ్రీ అభిమానుల వేదిక’ ఇవాళ సాయంత్రం సికింద్రాబాదులో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్యారడైజ్ సమీపాన గల సన్ షైన్ ఆసుపత్రి 3వ అంతస్తులోని శాంతా ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో సినీ దర్శకులు వి.ఎన్.ఆదిత్య, సీనియర్ సినీనటులు రావికొండలరావు తదితర సినీ ప్రముఖులు కూడా పాల్గొని ప్రసంగించనున్నారని ఫేస్ బుక్ లో వివరాలను వెల్లడించింది. 1970-80 దశకాల్లో ఉషశ్రీ విజయవాడ ఆలిండియా రేడియో కేంద్రంలో భారత, రామాయణాల గురించి అద్భుతమైన వ్యాఖ్యానాలను అందించేవారు. తన గంభీరమైన కంఠస్వరంతో రేడియో శ్రోతలను కట్టిపడేసే వారు. దశాబ్దాలు గడిచినా ఆయన వ్యాఖ్యానాల మీద ఉన్న అభిమానం తరగలేదనడానికి ఈ కార్యక్రమమే ఉదాహరణ.