: టీచర్ పై కక్షతో కొలరాడోలో కాల్పులకు దిగిన విద్యార్థి


అమెరికా సమాజం ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. అక్కడ దాడులు ఎక్కువ. ఆయుధాలతో ఎప్పుడు విరుచుకుపడతారో, దోచుకుపోతారో తెలియదు. అభివృద్ధి చెందిన దేశం కదా. కష్టపడడం ఇష్టంలేని వారు కాల్పులతో దోపిడీలకు దిగుతుంటారు. పౌరులు అక్కడ అనుమతితో తుపాకీలను కొని.. ప్రాణ రక్షణ కోసం నిక్షేపంలా వాడుకోవచ్చు. ఇదే అక్కడ వికసించని పసి మనసులు, విద్యార్థులతోనూ తుపాకీలను పట్టుకునేలా చేస్తోంది.

తోటి విద్యార్థులపై కోపమొచ్చినా, చదువులో వెనుకబడినా, ఒత్తిడికి గురైనా.. చివరికి టీచర్ కోపగించినా.. ఇంట్లో పెద్దవారి తుపాకీ తెచ్చి కాల్పులకు దిగుతున్నారు. ఇటీవలి కాలంలో అక్కడ ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొలరాడోలో నిన్న ఒక టీనేజీ విద్యార్థి కాల్పులకు దిగాడు. టీచర్ పై కక్షతో స్కూల్ కు వచ్చి కాల్పులు జరపడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. అనంతరం అతడు తన కణతపై కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. అరపాహో హై స్కూల్లో ఈ దారుణం జరిగింది. సదరు విద్యార్థి తన కోసం వెతుకుతున్నాడని తెలిసిన వెంటనే ఆ టీచర్ తెలివిగా స్కూల్ నుంచి జారుకున్నారు. అయితే, గాయపడ్డ విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News