: విద్యుత్ ఛార్జీల పెంపులో బేధభావం: రాఘవులు


విద్యుత్ ఛార్జీల పెంపులో పేదలకు, ధనికులకు మధ్య సర్కారు బేధభావం చూపించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. పేదలు, మధ్య తరగతి వారిపై 110 శాతం పెంచి, వ్యాపారులు, ధనికులపై నామమాత్రంగా భారం మోపారని అన్నారు. హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల వివరాలతో కూడిన పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ఇతర సంస్థలతో కలిసి ఉద్యమాన్నితీవ్రతరం చేస్తామన్నారు. సహకార ఎన్నికల్లో ధనబలంతోనే కాంగ్రెస్ గెలిచిందని రాఘవులు ఈ సందర్భంగా ఆరోపించారు. సీఎం ప్రజాబలంతో గెలిచామని అనుకుంటే అది పొరబాటే అవుతుందన్నారు. 

  • Loading...

More Telugu News