: రేణిగుంట-చైతన్యపురం రోడ్డులో రెండు లారీలు ఢీ.. ముగ్గురి మృతి


చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇవాళ ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనటంతో ఈ ఘోరం జరిగింది. రేణిగుంట మండల పరిధిలోని చైతన్యపురం రోడ్డుపై జరిగిన ఈ దుర్ఘటన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృత దేహాలను మార్చురీలో భద్రపరిచారు.

  • Loading...

More Telugu News