: ఫిక్సింగ్ కు దూరంగా ఉండాలని క్రికెటర్లకు అద్వానీ సూచన


స్పాట్ ఫిక్సింగ్ లకు పాల్పడుతూ సంచలనం సృష్టిస్తున్న క్రికెటర్లకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ కొన్ని సూచనలు చేశారు. ఆకర్షించే మార్గాల ద్వారా ధనవంతులయ్యే మార్గాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ రోజు ఇండోర్ లో జరిగిన ఇంటర్నేషనల్ సింధి కాన్ఫరెన్స్ లో అద్వానీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. గతంలో భారతీయ క్రికెటర్ విను మన్కడ్, ఇతరులు ప్రపంచ రికార్డులు నెలకొల్పి వార్తా పత్రికల మొదటి పేజీలో నిలిచేవారని.. కానీ, ప్రస్తుత క్రికెటర్లు ఫిక్సింగ్ మోసాల్లో పట్టుబడి తొలి పేజీల్లో కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించే అక్రమ మార్గాల పట్ల క్రికెటర్లు ఆకర్షితులవకూడదని సూచించారు.

  • Loading...

More Telugu News