: అమెరికా చట్టాలతో మా చెడ్డ చిక్కులు


తన ఇంట్లో పనిచేసే ఉద్యోగి వీసా పత్రాల్లో తప్పుడు సమాచారంతో మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్ లోని భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె గురువారం అరెస్టవగా.. బెయిల్ పై విడుదలయ్యారు. కానీ, అమెరికా చట్టాలు ఎంత చిత్రంగా ఉంటాయో అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. దేవయానికి నెల జీతంగా 4,120 డాలర్లు వస్తున్నాయి. కానీ, ఆమె ఇంట్లో పనిచేసే మహిళకు నెలకు 4,500 డాలర్లు(రూ. 2.79లక్షలు) చెల్లించడం లేదని అమెరికా అధికారులు కేసు పెట్టారు. అమెరికా చట్టాల ప్రకారం నెలకు 4,500 డాలర్లు చెల్లించాల్సిందే. లేదంటే నేరమే మరి.

అయితే 4,500 డాలర్ల కంటే తక్కువ చెల్లించేలా పనిమనిషి సంగీత్ రిచర్డ్ తో దేవయాని మరో ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా ప్రాసిక్యూషన్ అధికారులు అభియోగాలు మోపారు. వీటిని ముంబైలోని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే(విశ్రాంత ఐఏఎస్ అధికారి) ఖండిస్తున్నారు. కాంట్రాక్టు ప్రకారం సంగీత్ కు తన కూతురు నెలకు రూ. 30వేలు చెల్లిస్తోందని.. అయినా, నెలకు 10,000డాలర్లు (రూ. 6.2లక్షలు) చెల్లించాలంటూ బెదిరిస్తోందని తెలిపారు. అడిగినంత చెల్లించకపోయే సరికి కేసు పెట్టిందన్నారు.

  • Loading...

More Telugu News