: ఎర్రబుగ్గ వాహనం వాడిన దిగ్విజయ్ పై ఫిర్యాదు
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రాజ్యాంగ పదవుల్లో లేని వ్యక్తులు ఎర్రబుగ్గ వాహనం వాడరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని దిగ్విజయ్ ఉల్లంఘించారని తెలుగు యువత సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, ఆ విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ ఎర్రబుగ్గ వాహనం వాడి అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే.