: పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి దీపోత్సవం
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇవాళ ఉదయం సత్యసాయి దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లావాసులు ఈ దీపోత్సవంలో పాల్గొని సత్యసాయి చిత్రపటాన్ని పుట్టపర్తి పురవీధుల్లో ఊరేగించారు. రెండు వేల మంది వెంట రాగా ఊరేగింపు చిత్రావతి నది వరకు సాగింది. అక్కడ 1008 దీపాలు వెలిగించగా.. దీప కాంతులతో చిత్రావతి నదీ తీరం కళకళలాడింది. సత్యసాయి చిన్ననాటి నుంచి నడయాడిన ఈ నదీ తీరాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు.