: మాజీ క్రికెటర్ గంగూలీకి బీజేపీ ఆహ్వానం
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి బీజేపీ ఆహ్వానం పలికింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ బెంగాలీ దాదాకు టికెట్ ఇస్తామని కబురు పంపింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయే గంగూలీని రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే క్రీడా మంత్రిని చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు సమాచారం. తనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందిన మాట నిజమేనని గంగూలీ కూడా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నానని.. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఒక బెంగాలీ దినపత్రికతో చెప్పారు. ఇంతకీ గంగూలీకి ఈ ఆఫర్ చేయడంలో వరుణ్ గాంధీ ముఖ్యపాత్ర పోషించారు. మేనకాగాంధీ కుమారుడైన వరుణ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బెంగాల్ రాష్ట్ర వ్యవహారాలను చూస్తున్నారు.