: కాంగ్రెస్.. ఎంతకు దిగజారింది!
కేంద్రంలో తమది సుపరిపాలన, సంక్షేమ పాలన అని చెప్పుకునే కాంగ్రెస్.. విజయం కోసం ఎంతకైనా దిగజారతానని నిరూపించుకుంది. ఛత్తీస్ గఢ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా తమకు అనుకూలంగా వార్తలు రాసేందుకు జర్నలిస్టులను కొనే ప్రయత్నం చేసింది. రాయిపూర్ లో ఒక్కో విలేకరికి 50వేల రూపాయల చొప్పున 100 మంది జాబితా తయారు చేసి.. పంపకం చేసింది. కొందరు కాంగ్రెస్ తాయిలం పుచ్చుకోగా, కొందరైతే మొహం మీద కొట్టేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి రమేష్ వర్లయాని ఆధ్వర్యంలోని మీడియా సెల్ ఈ వ్యవహారం చూసింది.