: లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసిన కేజ్రీవాల్
హస్తిన రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిశారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఆసక్తి చూపకపోవడంతో... లెఫ్టినెంట్ గవర్నర్ ఏఏపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆయన నివాసంలో కలిశారు. అయితే ఏఏపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది... ఎందుకంటే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అవినీతిపై పోరాడిన కేజ్రీవాల్ ఆ పని చేస్తారా? అనే విషయం వేచి చూడాలి.