: శివరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పదవిని చేపడుతున్న బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయనకు శివరాజ్ సింగ్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. మొన్న జరిగిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు వెళ్లాల్సి ఉండగా... రాష్ట్ర అసెంబ్లీకి టీబిల్లు వస్తుండటంతో ఆయన ఆ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కార్యక్రమాలకు వరుసగా చంద్రబాబుకు ఆహ్వానాలు అందుతుండటంతో... రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తును కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News