: ఈ సన్‌గ్లాసులు భలే
సన్ గ్లాసులు అంటే ఏదో ఒకే రకమైన లెన్స్‌తో మనకు లభిస్తుంటాయి. అలా కాకుండా మనకు నచ్చిన విధంగా, సూర్యకాంతి తీవ్రతనుబట్టి లెన్స్ మార్చుకునేలా ఉంటే... అప్పుడు భలేగా ఉంటుంది కదూ. అందుకే లగ్జరీ గ్లాస్‌లు ఉత్పత్తి చేసే కంపెనీల్లో మోవిజిమ్ కంపెనీ వారు కొత్త రకం ఫ్రేమ్ టెక్నాలజీతో స్విచ్ బ్యాక్స్ అనే కొత్తరకం సన్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. సూర్యకాంతి తీవ్రతను బట్టి ఈ కళ్లజోడుకు వివిధ రకాల లెన్స్‌ను మనం క్షణాల్లో మార్చుకోవచ్చట. సన్‌గ్లాసెస్ ఫ్రేమ్ పైభాగంలో ఉన్న ఒక బటన్‌ను నొక్కగానే ఫ్రేమ్ నుండి లెన్స్ విడుదల అవుతుంది. దాని స్థానంలో మరో లెన్స్ పెట్టి ఆ బటన్ మరోసారి నొక్కగానే ఆ లెన్స్ ఫ్రేమ్‌లో ఇమిడిపోతుందట. అన్నట్టు దీని ధర రూ.15,400 మాత్రమే.