: కొడుకు, అల్లుణ్ని కాపాడుకునేందుకే విజయమ్మ 'మద్దతు' ఎత్తుగడ: కేటీఆర్
వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని సంకేతాలు పంపడం వెనుక కొడుకు, అల్లుణ్ని కాపాడుకోవాలన్న తపన కనిపిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు అన్నారు. జగన్ జైల్లో ఉండడం, బ్రదర్ అనిల్ పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే విజయమ్మ తాజా ఎత్తుగడ వేసిందని కేటీఆర్ ఆరోపించారు.