: ఫోర్బ్స్ ఇండియా జాబితాలో పవన్ కళ్యాణే నెంబర్ వన్..


తెలుగు చిత్ర పరిశ్రమలోని సెలబ్రిటీలలో పవన్ కళ్యాణే నెంబర్ వన్ అని ఫోర్బ్స్ ఇండియా జాబితా వెల్లడించడంతో మరోసారి రికార్డుల్లో కెక్కారు. ఇక హిందీ చిత్ర పరిశ్రమలో షారూక్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. 2013 సంవత్సరానికి రూపొందించిన భారత సెలబ్రిటీల జాబితాలో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26 స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ జాబితా వెల్లడించింది. దీంతో భారత్ లో పవన్ సంపాదనలో 13 ర్యాంక్ లో నిలవగా.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మాత్రం రూ.12 కోట్ల సంపాదనతో 69 స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ప్రిన్స్ మహేష్ బాబు విషయానికి వస్తే... మహేశ్ 54వ స్థానంలో నిలిచాడు. మహేశ్ బాబు ఈ సంవత్సరంలో 28 కోట్ల రూపాయలకు పైనే సంపాదించాడని చెప్పింది. ఇక అక్కినేని నాగార్జున రూ.20 కోట్ల సంపాదనతో 61 స్థానాన్ని, రవితేజ 13 కోట్ల సంపాదనతో 68 స్థానాన్ని దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News