: సీఎంను బర్తరఫ్ చేయాలి: నాగం
ప్రజాస్వామ్య విలువలు పాటించనందున సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తక్షణం బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఆదేశాలను కూడా సీఎం కిరణ్ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో చర్చకు పెట్టకుండా అడ్డుకుంటున్న సీఎం తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని నాగం సూచించారు.