: అబ్దుల్ కరీం టుండాపై అనుబంధ చార్జ్ షీట్


లష్కరే తాయిబా సభ్యుడు అబ్దుల్ కరీం టుండాపై ఢిల్లీ పోలీసులు ఈ రోజు అనుబంధ చార్జ్ షీట్ ను చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కు సమర్పించారు. 1997, అక్టోబర్ 1న సదర్ బజార్, కుతుబ్ రోడ్ లో జరిగిన రెండు పేలుళ్ల కుట్రలో టుండాకు సంబంధం ఉందని తెలిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద టుండాపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న టుండాపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News