: రేపు ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్న కేజ్రీవాల్


ఢిల్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలను రాబట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ రేపు ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలవనున్నారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ... తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యా బలం తేదని లెఫ్టినెంట్ గవర్నర్ కు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రెండో స్థానంలో నిలిచిన ఏఏపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, అరవింద్ కేజ్రీవాల్ రేపు ఉదయం 10.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. అయితే తమకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేదని నజీబ్ జంగ్ కు కేజ్రీవాల్ చెబుతారని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News