: సుప్రీంకోర్టు తీర్పు అవమానకరం: షర్మిలా ఠాగోర్
స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు తీర్పు అవమానకరమని బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా ఠాగోర్ అన్నారు. ఇటువంటి తీర్పు చాలా తప్పు అని వ్యాఖ్యానించారు. ఆగ్రాలో జరిగిన తాజ్ లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరైన ఆమె పైవిధంగా స్పందించారు. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమంటూ రెండు రోజుల కిందట సుప్రీం వెలువరించిన తీర్పుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.