: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారు: దిగ్విజయ్ సింగ్


రాష్ట్ర విభజన చేస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆరే చెప్పారని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు తనకు మంచి మిత్రుడని... ఆయన చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. జగన్ మా పార్టీ డీఎన్ఏ అని గతంలో తాను చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టానికి విరుద్ధంగా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లదని చెప్పారు.

ప్రధాని అభ్యర్థి వల్లే నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే విమర్శలు సరైనవి కావని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లిన తర్వాత సోనియాగాంధీతో చర్చిస్తామని అన్నారు. సోనియాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డిగ్గీ రాజా తెలిపారు. 15 రోజుల్లోపు విశాఖపట్నంలో పర్యటిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News