: గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవోల అరెస్టు
గాంధీభవన్ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతలను ఏపీఎన్జీవో భవనం వద్ద అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టుచేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారన్న వార్త తెలుసుకున్న ఏపీ ఎన్జీవోలు దానిని అడ్డుకునేందుకు బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు.