: బిల్లును సకాలంలోనే కేంద్రానికి పంపుతాం: సీఎం కిరణ్
తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన గడువులోనే కేంద్రానికి తిరిగి పంపుతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 371 (డి) అధికరణానికి రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్లో ఉందని, బిల్లులో ఉన్న ప్రతి నిబంధనపై శాసనసభలో ఓటింగ్ అవసరమని ఆయన అన్నారు. కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు ఆంగ్లంలో ఉందని, దీన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసరం ఉందన్నారు. మరి కాసేపట్లో శాసన సభ్యులందరికీ ముసాయిదా బిల్లు ప్రతులు అందజేస్తామని కిరణ్ చెప్పారు.