: అసెంబ్లీకి చేరిన బిల్లు
రాష్ట్ర శాసనసభకు తెలంగాణ బిల్లు చేరింది. అసెంబ్లీ కార్యదర్శికి సచివాలయ అధికారులు బిల్లు ప్రతులను అందజేశారు. అయితే శాసనసభ్యులకు వీటిని ఎప్పటిలోపు అందిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మరో రెండు గంటల్లో సభ్యులకు బిల్లు ప్రతులను అందజేసే అవకాశం ఉన్నట్టు అనధికారిక సమాచారం.