: ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ పుజారా


కొత్త పెళ్లికొడుకును ఐసీసీ అవార్డు వరించింది. క్రికెట్ లో పలు విభాగాల్లో తిరుగులేని ప్రతిభతో అభిమానులను అలరించిన క్రికెటర్లకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. ఇందులో టీమిండియా యువ సంచలనం ఛటేశ్వర్ పుజారాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. తాజాగా వివాహమయిన పుజారాకు ఇది సరికొత్త అనుభూతి. కాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రెండు అవార్డులకు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఎంపికయ్యాడు.

ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కుమార సంగక్కర దక్కించుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లకు లభించే గౌరవం ఈసారి ఆసీస్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కు దక్కింది. గిల్లీని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోనికి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News