: సీఎంపై అవిశ్వాస తీర్మానం పెడతాం: డిప్యూటీ సీఎం దామోదర
ముఖ్యమంత్రి కిరణ్ పై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కిరణ్ పై తమకు నమ్మకం పోయిందని అన్నారు. ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు. దీనికోసం, వెంటనే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ లాబీలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నారని దామోదర ఆరోపించారు.