: నినాదాలతో హోరెత్తిన శాసనసభ.. సోమవారానికి వాయిదా
రెండు వాయిదాల అనంతరం శాసనసభ మళ్లీ ప్రారంభమైంది. పోడియం వద్దకు చొచ్చుకొచ్చిన తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభ్యులకు ఎంతో సర్ది చెప్పారు. అయినా, నేతలు ఎంతకూ వినకపోవడంతో సోమవారానికి శాసనసభను వాయిదా వేశారు.