: ఎప్పుడు చర్చించాలన్నది వారి నిర్ణయమే: దానం నాగేందర్


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను లేక్ వ్యూ అతిథి గృహంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డిలు కలిశారు. భేటీ అనంతరం మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి సమర్పించే అవకాశం ఉందని, సమావేశాల్లో ఎప్పుడు చర్చకు పెట్టాలనే దానిపై గవర్నర్, సీఎం, స్పీకర్ లు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. హైదరాబాద్ పై అభ్యంతరాలను దిగ్విజయ్ కు తాను వివరించినట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News