: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరారాజె ప్రమాణ స్వీకారం


రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరారాజె సింధియా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా వసుంధర చేత ప్రమాణం చేయించారు. జైపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ హాజరై వసుంధరకు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు, ప్రజలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News