: నేను మాట అంటే వెనక్కి తీసుకోను: కేసీఆర్


తాను మాట ఇస్తే దానికి తిరుగు ఉండదని, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందరి కల త్వరలోనే నిజం కాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తెలంగాణను సాధించుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇస్తామన్నారు.

కొద్దిరోజుల క్రితం కొంతమంది ఐఏఎస్ అధికారులతో తెలంగాణ పునర్నిర్మాణం గురించి సమావేశమయ్యానని, వారంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారన్నారు. ఉద్యోగులు, రాజకీయ వర్గాలు అన్నదమ్ముల్లా ఉద్యమాన్ని ఎలా చేపట్టామో, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగే తీర్చిదిద్దాలని అన్నారు.

అలాగే తమ ప్రాంతం నుంచి తెలంగాణ వ్యతిరేకుల్ని తరిమేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండగా ఏ ఉద్యోగినీ పల్లెత్తు మాట అనలేదని అన్నారు. ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నామన్న కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగుల మిత్ర ప్రభుత్వం అవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News