: సెన్సార్ బోర్డులో అర్హత కలిగినవారే ఉండాలి: కమల్ హాసన్
సెన్సార్ బోర్డుపై తన అభిప్రాయాన్ని నటుడు కమల్ హాసన్ స్పష్టంగా చెప్పారు. కేవలం అర్హత కలిగిన వారే సెన్సార్ బోర్డులో ఉండాలనేది తన దృఢమైన ఆలోచన అని చెప్పారు. దీనిపై సినీ పరిశ్రమ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బోర్డులో ఉన్నవారు అర్హత లేనివారన్నారు. వారు కేవలం సినిమాలను ఇష్టపడతారని, ఎప్పుడూ వారు సినిమాలను చూస్తున్నా... నిపుణులుగా మాత్రం మారలేకపోతున్నారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు సెన్సార్ బోర్డులో ఉండాలని కోరుకుంటాయని... అది తప్పని పేర్కొన్నారు.
నిన్న(గురువారం) ప్రారంభమైన చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు కమల్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పలువురు అడిగిన ప్రశ్నలకు కమల్ సమాధానాలిచ్చారు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అర్హత కలిగిన విమర్శకులే సెన్సార్ బోర్డుకు అవసరం కదా? అని అడిగారు. దానికి సమాధానంగానే కమల్ పైవిధంగా సమాధానమిచ్చారు.