: కేంద్రం ఆదేశాలను సీఎం అమలు చేయాలి: ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లును ప్రవేశపెట్టకుండా దాటవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.