: నా భర్త రాజకీయ కుట్ర బాధితుడు: లాలూ సతీమణి
తన భర్త లాలూ ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన భర్త అమాయకుడని, రాజకీయ కుట్రతో దాణా స్కామ్ లో ఇరికించారని ఆరోపించారు. దోషిగా తేలడంతో లాలూ 11ఏళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయినా, పార్టీకి పెద్ద దిక్కు ఆయనేనని, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తారని రబ్రీదేవి చెప్పారు. లాలూని కుట్రపూరితంగా ఇరికించిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశంగా తీసుకుంటామన్నారు.