: అబ్బే.. జగన్ ప్రభావం ఏమంతలేదు: వీహెచ్
రాష్ట్రంలో జగన్ ప్రభావం ఏమంత కనిపించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ప్రభావం తగ్గుతున్న సూచనలు కనిపించడంతోనే విజయమ్మ నోట విలీనం మాటలు వినిపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్ కోట్లు కొల్లగొట్టాడని వీహెచ్ అన్నారు. 'జగన్ నీతిమంతుడే అయితే ప్రస్తుతం జైల్లో ఎందుకున్నట్టో' అని ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల విషయంలో మరికొందరు మంత్రులు జైలుకెళ్తారని వీహెచ్ చెప్పారు.