: రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు.. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
రాజ్యసభలో కేంద్ర మంత్రి నారాయణసామి లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టారు. అన్నా హజారే దీక్ష నేపథ్యంలో, ప్రజల నుంచి మరింత వ్యతిరేకత రాకముందే యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టింది. మరో వైపు లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. తుపానుల ప్రభావంతో జరిగిన నష్టంపై చర్చ జరుగుతుండగా లోక్ సభ పోడియంలోకి దూసుకెళ్లిన సీమాంధ్ర ఎంపీలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ నినాదాలు చేస్తుండడంతో స్పీకర్ మీరా కుమార్ లోక్ సభను ఒంటి గంట వరకు వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ కూడా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాయిదా పడింది.