: శీతాకాల రాజ్యసభ సమావేశాలకు సచిన్ హాజరు
మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో సభ్యులందరూ సచిన్ వైపే చూడటం విశేషం. ఈ సందర్భంగా భారతరత్న పురస్కారం పొందిన సచిన్ తో పలువురు సభ్యులు కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది సభ్యులైతే సచిన్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అనంతరం సభ వాయిదా పడింది.