: నోకియా ఆండ్రాయిడ్ ఫోన్?


ఇప్పటి వరకు విండోస్ ఫోన్లకే పరిమితమైన నోకియా ఇకపై ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో మొబైల్ ఫోన్ల మార్కెట్లో వాటా పెంచుకోనుందా? చూస్తుంటే అది నిజమేనని తెలుస్తోంది. వచ్చే ఏడాది నోకియా ఆండ్రాయిడ్ ఓఎస్ తో ఒక మొబైల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అది నోకియా లుమియా మోడల్ ను పోలి ఉన్నట్లుగా ఇంటర్నెట్ లో ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో స్కైప్ అప్లికేషన్ కూడా ఉండనుంది. మైక్రోసాఫ్ట్ నోకియాను కొనుగోలు చేసిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లతో మోడళ్లను విడుదల చేయబోతుండడం నిజంగా సంచలనమే. వ్యాపార కోణంలో చూస్తే ఇది నోకియా మార్కెట్ వాటాను రాకెట్ వేగంతో పెంచే నిర్ణయం కాగలదు.

  • Loading...

More Telugu News