: భారత్ లో టాప్ సెలబ్రిటీగా షారూక్


భారత్ లో టాప్ సెలబ్రిటీగా బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కే ఫోర్బ్స్ పత్రిక మరోసారి చోటిచ్చింది. భారత్ లోని 100 మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్ రెండవ ఎడిషన్ ను విడుదల చేసింది. ఫోర్బ్స్ మొదటి ఎడిషన్లోనూ షారూకే ప్రథమ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. తాజా ఎడిషన్లో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ రెండో స్థానానికి చేరుకున్నారు. గత ఎడిషన్ లో ధోనీ మూడో స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ రెండు నుంచి మూడో స్థానానికి దిగిపోయారు. సచిన్ 4వ స్థానంలో, అమితాబ్ 5వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ గతం కంటే తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. కోహ్లీ 7వ స్థానంలో, కత్రినా 9వ స్థానంలో నిలిచారు. కమల్ హాసన్ 47వ స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News