: జస్టిస్ గంగూలీపై దద్దరిల్లిన లోక్ సభ.. ఉభయసభలు గంటపాటు వాయిదా
ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు గంటపాటు వాయిదా పడ్డాయి. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ గంగూలీపై లోక్ సభ దద్దరిల్లింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగూలీపై తక్షణమే చర్చలు తీసుకోవాలని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. గంగూలీని పదవి నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టింది. వీరితో పాటు సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభను కూడా ఛైర్మన్ హమీద్ అన్సారీ గంటపాటు వాయిదా వేశారు.