: అవిశ్వాసం పెడతాం, మద్దతిచ్చేవాళ్లు ముందుకు రండి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి ఉగ్రనరసింహావతారం ఎత్తారు . తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణపై శాసనసభను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని, మద్దతిచ్చే వాళ్లెవరో ముందుకు రావాలని సహచర విపక్షాలకు పిలుపునిచ్చారు. అవిశ్వాసంపై ఇప్పటికే సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, లోక్ సత్తా పార్టీలను సంప్రదించామని, వాళ్లు తమ నిర్ణయం త్వరలో తెలియజేస్తారని కేసీఆర్ వెల్లడించారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కూడా అవిశ్వాసానికి మద్దతివ్వమని కోరుతామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి బీజేపీతో పాటు నాగం జనార్థన రెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కాగా, పలుమార్లు వాయిదా పడిన 'సడక్ బంద్' ను ఈనెల 21న నిర్వహిస్తామని, ఆ వ్యవహారాలను ఈటెల రాజేందర్ చూసుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News