: తెలంగాణ బిల్లుపై ఫోన్ లో డిప్యూటీ సీఎం ఆరా
రాష్ట్రానికి చేరిన తెలంగాణ బిల్లుపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడు బిల్లు కాపీ చూద్దామా అని తహతహలాడుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొద్దిసేపటి కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఫోన్ చేసి ఆరా తీశారు. మరో మూడు గంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులు శాసనసభకు వస్తాయని, అందరికీ ఇస్తామని దామోదరతో సీఎస్ చెప్పినట్లు సమాచారం.