: లష్కరే తాయిబా కుట్ర భగ్నం
ఢిల్లీలో దాడులకు పాల్పడాలన్న లష్కరే తాయిబా ఉగ్ర కుట్రను ప్రత్యేక విభాగం పోలీసులు భగ్నం చేశారు. మేవాత్ కు చెందిన ఇమామ్ మొహమ్మద్ షాహిద్ ను అరెస్ట్ చేశారు. ఇతడి సహచరుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. షాహిద్ పాకిస్థాన్ కు రెండు సార్లు వెళ్లొచ్చాడని.. అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా కుట్ర విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.