: ఈ బైక్ పర్యావరణ హితమేనట
బయటికి వెళ్లాలంటే భయం. ఎందుకంటే చుట్టూ వున్న కాలుష్యం మన ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి మనందరికీ తెలిసిందే. దీంతో బయటికి వెళ్లడానికి చాలామంది బద్దకిస్తుంటారు. ఇలాంటి వారికి ఇది నిజంగా మంచివార్తే. ఎందుకంటే బయటికి వెళ్లడానికి భయపడేవారికి మీరు ప్రయాణించేంత దూరం మేరా గాలిని శుభ్రపరిచే సరికొత్త బైక్ మార్కెట్లోకి రానుంది.
రద్దీ రోడ్లలో కాలుష్యం వల్ల భయపడేవారికి అలాంటి భయాలేమీ అక్కర్లేదంటూ ఒక సరికొత్త బైక్‌ను బ్యాంకాక్‌లోని ఒక కంపెనీవారు తయారుచేశారు. దీనిపై ప్రయాణిస్తున్న సమయంలో అది చుట్టుపక్కల ఉన్న గాలిని శుభ్రం చేస్తుందని కంపెనీ వారు చెబుతున్నారు. ఇందులోని అల్యూమినియం ఫ్రేం ఫోటోసింథసిస్ ప్రక్రియద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని, దానివల్ల మీ చుట్టూ ఉన్న గాలి పరిశుభ్రంగా ఉంటుందని కంపెనీ వారు చెబుతున్నారు. కాబట్టి కాలుష్య భూతానికి భయపడేవారు చక్కగా ఈ బైక్‌ను కొనేసి బయటికి కదలండిమరి!