: రేపు పాట్నాకు పయనమవుతోన్న జగన్
పార్లమెంటులో విభజన బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన పంథాలో ముందుకెళ్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా రేపు పార్టీ నేతలతో కలిసి ఆయన పాట్నా వెళుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలను కలిసి సమైక్య రాష్ట్రం కోసం మద్దతును కోరిన సంగతి తెలిసిందే.